గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Tuesday, October 23, 2007

నువ్వు లేనప్పుడు...

నువ్వున్నప్పుడు...
టీవీ లో క్రికెట్టో, ఫుట్‌బాలో చూస్తూ
నువ్వేసిన పకోడీలు తిని, నువ్విచ్చే కాఫీ తాగి
నీ మీద వెధవ జోకులేస్తూ మేధావిలా ఫోజెట్టి
కిటికీలోంచి పక్కింటి అమ్మయిని చూసి ఈలవేసి
ప్రతి క్షణం నా మగ బుద్ధిని చూపించే నేను...

నువ్వు దగ్గర లేనప్పుడు...
రేడియోలో రఫీ పాటలు వింటూ
తిండి సయించక మూడంకె వేసుకు పడుకుని
నిర్వేదంగా నాలోనేనే నవ్వుకుంటూ
గది కప్పు కేసి గంటల తరబడి చూస్తూ
స్థాణువునై పడున్నాను

7 Comments:

Blogger కొత్త పాళీ said...

ఓ దునియాకే రఖ్ వాలే! సునో, దర్ద్ భరే మెరె నాలే! సునో, దర్ద్ భరే మెరె నాలే!!

October 23, 2007 10:06 PM  
Blogger నవీన్ said...

ఉహు. అది కాదు. హమ్ తుమ్ సె జుదా హోకే...

October 23, 2007 11:36 PM  
Blogger Hemanth Pradeep said...

naveen garu
me kavitha adbutam ...

chaala hrydyam ga raasaru...

October 29, 2007 8:44 PM  
Blogger CassAmino said...

హాయ్ నవీన్, మీకు తెలుగు భాష మీద వున్న అభిమానానికి జోహార్లు. I would like to invite you to an idea for Telugu people and Telugu Language lovers, please visit http://www.atuitu.com I shall be glad to have your contribution on atuitu in terms of participation and your writings. Cheers, Cass.

December 01, 2007 5:42 PM  
Blogger sudha kanchi said...

hello sir
just while browsing i come across yr "gaddi poolu". nice
here i need a little favour. i need a good motivational name to my business in telugu or in sanskrit(telugu preferable) like spandana, sphoorthy like catchy. its a business related to women development. As u r very good in telugu i'm approaching u. hope u can

July 17, 2009 11:45 AM  
Anonymous Anonymous said...

iwwh.blogspot.com మీకు తెలుగు భాష మీద వున్న అభిమానానికి జోహార్లు

November 13, 2009 5:59 PM  
Blogger లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఇంద్రధనుస్సు కవితకి వ్యాఖ్యలు రానీయకుండా చేశారేం నవీన్ గారూ! అందుకే ఇక్కడికొచ్చి రాస్తున్నా.

భావాల పారిజాతాలతో కవితాహారం
నవ పరిమళాలు వెదజల్లుతోంది!!

May 18, 2010 3:41 PM  

Post a Comment

<< Home