గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Wednesday, October 13, 2004

తెలుగు లేఖ

నా లేఖ పూర్తి కావచ్చింది. లేఖ అంటే నేను ఎవరికో జాబు రాస్తున్నాననుకునేరు... అదేం కాదు. లేఖ అంటే తెలుగుని ఆంగ్ల లిపిలో ఫొనెటిగ్గా రాస్తే తెలుగు లిపిలోకి తర్జుమా చేసే ప్రోగ్రాం అన్నమాట. గత రెండు వారాలుగా వీలు దొరికినప్పుడల్లా ఈ ప్రోగ్రాం మీద పని చేస్తూ వచ్చాను. గత మూడు రోజులుగా ఏకబిగిన పని చేసి ఆఖరికి పని చేసే స్థాయికి తీసుకువచ్చాను. ఇంకా కొన్ని చిన్న చిన్న మెరుగులు దిద్దవలసి ఉంది. నేను సొంతంగా రాసుకున్న ప్రోగ్రాం వాడి తెలుగులో రాయగలగడం నన్నెంతగానో ఉత్తేజపరుస్తోంది.. ఇప్పుడు మీరు చదువుతున్న తెలుగు కంటెంటు నా లేఖ ప్రోగ్రాం ద్వారా రాసినదే :) త్వరలో మరిన్ని మెరుగులు దిద్ది ఈ ప్రోగ్రాంను అందరికీ అందుబాటులో ఉంచాలని నా ప్రయత్నం.


14 Comments:

Blogger oremuna said...

UrikE google lO "telugu blog " ani search koTTi caduvutuMTE ikkaDiki vaccinaanu.

--> lEKa valla vupayOgaalu EmiTi?
--> yudit ni nEnu upayOgistunnaanu, daanilO lEdnidi lEKa lO Emi vunnayi?
--> Emi lEka pOtE yudit lO bugs nE correct ceyyavaccu kadaa :-)
light gaa teesukODi gurU.

mIku naaku okka vishayamulO kalisiMdi, nEnu kUDaa cinnappuDu pustakaalu prapaMcanni paracipOyi cadivEvaaDini. ippuDu kUDaa appuDappuDu english fantasy (like Harry potter, etc..) chaduvutunnaanu.

October 29, 2004 11:10 PM  
Blogger oremuna said...

గడ్డి పూలు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న సి నా రె గారి గీతలు గుర్తు వస్తున్నయి

దారంట పోతుంటే దారమల్లె సాగి ఉండు
.....
గుక్కెడు వాన నీళ్ళకు ఫక్కున నవ్వు

మీకు పూర్తిగా తెలిస్తే చెప్పగలరు
తెలిసే ఉంటుంది లేండి లేకపోతే మీ బ్లాగు పేరు గడ్డి పూలు అని ఎందుకు పెట్టు కుంటారు!

November 03, 2004 10:30 AM  
Blogger oremuna said...

No updates?

November 09, 2004 6:10 PM  
Blogger నవీన్ said...

సారీ గురువుగారూ, పని ఒత్తిడి వల్ల గత నెల రోజులుగా బ్లాగుకేసి చూడలేదు. మీ మూడు కామెంట్లకు కృతజ్ఞుణ్ణి. నా లేఖవల్ల ఉపయోగం ఏంటంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. అక్షరమాల ఫ్రీ ఎడిషన్లో ఆర్.టి.ఎస్. కంటెంటు పేస్టు చేస్తే తెలుగులోకి మార్చే సదుపాయం లేదు. దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి లేఖ రాసాను. మీరనే యుడిట్ నేను వాడలేదు గాని, దాని గురించి కాస్త తెలుసు. యుడిట్ లో బగ్స్ ఫిక్స్ చేస్తే నాకొచ్చే ఆనందం ఏమీ లేదు కాబట్టి ఆ పని చేయలేదు. ఆఫీసులోనే కాక, ఇంట్లోనూ బగ్స్ ఫిక్స్ చేసేంత ఓపిక లేదు గురువుగారూ... ;-) సో, లేఖ నా ప్రోగ్రామింగ్ ఆనందం కోసం మాత్రమే రాసుకున్నానని మనవి చేసుకుంటున్నాను. వేరే వాళ్ళకు ఉపయోగపడితే మంచిదే. లేకపోయినా ఏ గొడవా లేదు :) ఇకపోతే గడ్డిపూల గురించి. మీరనే సినారె గేయం గురించి నాకు తెలియదు. చిన్నప్పుడు స్కూల్లో చదివిన గేయం పేరు పెట్టాను. అలా కాకపోయినా గడ్డిపూలంటే నాకు నిజంగానే ఇష్టం. వాటి మీద సినారె కి పేటెంటు లేదు కదా కొంపదీసి ;-)

ఇక బ్లాగ్ అప్డేటు గురించి. గత నెల రోజులుగా పని ఒత్తిడి వల్ల బ్లాగుకేసి చూడ్డం కుదరలేదండీ. ప్రస్తుతం డల్లాస్ లో ఉన్నాను పని మీద. బ్లాగుకు బోలెడంత మేత ఉంది. త్వరలో అప్డేటు చేస్తాను. నా బ్లాగు చదివినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు.

November 14, 2004 9:45 AM  
Blogger oremuna said...

cool

November 14, 2004 9:15 PM  
Blogger The Cydonian said...

సాటి తెలుగు బ్లాగు వీరునకు నమస్సుమాంజలులు.

ప్రస్తుతం నాకు కలిగే ప్రశ్న ఒకటే: లేఖ ఏ ఫ్లాట్ఫార్మ్లో డెవెలప్ చేస్తున్నారు? ఎందుకంటే, నేను కూడా ఇటువంటి ప్రాజెక్టు మొదెలడదాము అని అనుకున్నాను, కాకపోతే, కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా, ఓ చిన్న బ్రేక్ తీసుకోవాలిసి వచ్చింది.

November 16, 2004 6:37 PM  
Blogger నవీన్ said...

మెటామ్యుటేటర్ గారూ, నేను లేఖను జావాలో రాసాను. బాగానే పని చేస్తోంది గాని ఇంకా కొన్ని చిన్న చిన్న సవరణలు చేయాల్సి ఉంది. ఆఫీసు పని మూలాన ఒకటిన్నర నెల అయింది అటువేపు చూసి.

November 28, 2004 8:04 AM  
Blogger oremuna said...

what is the current status?

http://geocites.com/vnajarjuna/padma.html

January 05, 2005 6:32 PM  
Blogger నవీన్ said...

కిరణ్ గారూ, క్షమించాలి. నా గొంగళి ఎక్కడ వేసినది అక్కడే ఉంది. మిగిలిపోయిన నా ప్రోగ్రాం పని పూర్తి చేయడం కుదరలేదు, ఆఫీసు పని వల్ల, నా బద్ధకం మూలాన. మీరు పంపిన లింక్ నేను ఇంతకు ముందే చూసాను. నా లేఖ కూడా అలాంటిదే. కాకపోతే లేఖ RTS compatibility తో బాటు కాస్త టైపింగ్ సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది. సున్న (అనుస్వరం)రాయాల్సిన చోటల్లా M వాడక్కర్లేదు. ఉదా: maMdAraM అని రాయనక్కరలేదు. mandAram అంటే చాలు. అలాగే పదాలలో n,m వాడినప్పుడు సందర్భాన్ని బట్టి సున్నా లేక హల్లు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న తేడాలు తప్ప లేఖ లో ప్రత్యేకత ఏమీ లేదు. నాగార్జున గారి ప్రోగ్రాం వాడుకోవచ్చు హ్యాపీగా.

January 13, 2005 12:00 PM  
Blogger Naga said...

మీరు తయారు చేసిన లేఖను నేను వాడి చూడాలి అనుకుంటున్నాను. అలాగే మీకు ఓపెన్ సోర్సుగా మార్చే ఉద్దేశ్యము ఏమైనా ఉన్నదా? నేను కూడా మీలాగే సొంతంగా ఒక అప్లికేషను వ్రాసుకొని చక్కగా తెలుగులో వ్రాస్తున్నాను. నా వెబ్ సైటు www.tenugu.org ఒకసారి చూడగలరు.

May 26, 2005 10:56 AM  
Anonymous Anonymous said...

నేను కూడ ఇదే project మీద పని చేదాం అనుకుంటున్ననండి .
చాలా సంతోషంగా ఉంది మీరు చేసె ప్రయత్నం వింటుంటే
నెమ్మిదిగా అయినా పర్లేదు
అది పూర్తి చేసి అందరికి అందుబాటులో ఉంచగలరని ఆసిస్తున్నాము

September 19, 2007 10:25 AM  
Blogger Unknown said...

hi naveen mee rasina vishayalu chduvutunte time teliyadam ledu maku teliyakundane chadivistunnaru....

April 25, 2008 5:01 PM  
Blogger Unknown said...

hi naveen mee rasina vishayalu chduvutunte time teliyadam ledu maku teliyakundane chadivistunnaru....

April 25, 2008 5:01 PM  
Blogger Unknown said...

hi naveen mee rasina vishayalu chduvutunte time teliyadam ledu maku teliyakundane chadivistunnaru....

April 25, 2008 5:02 PM  

Post a Comment

<< Home