ఉరి తాటికి లొంగని ఒక పూర్ణిమ
ఈ రోజు ఉదయం ధనుంజయ్ ను ఉరి తీసారు. అతడు చేసిన నేరానికి తగ్గ శిక్షే పడింది. నేను ఆలోచిస్తున్నది (అతనికి) ఉరి శిక్ష సబబా కాదా అన్న విషయం గురించి కాదు. ఈ సంఘటనలో ఇంకో కోణం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ధనుంజయ్ నేరం చేసి 14 సంవత్సరాలైంది. అప్పటికి అతనికి పెళ్ళై ఏడెనిమిది నెలలు మాత్రమే అయింది. అతడి భార్య పూర్ణిమ ఆనాటి నుండి ఈ రోజు వరకూ అతడి పక్షాన పోరాడుతూనే ఉంది. కోర్టు తీర్పు, ప్రజల భావాలు ఎలా ఉన్నా, తన భర్త నిర్దోషి అని నమ్మి అతని వైపునే ఉంది. ఒక ఏడు నెలలు కలిసి ఉన్నందుకు జీవితమంతా శిక్ష అనుభవిస్తోంది. అతని తల్లిదండ్రులు అతని పక్షాన ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని నెలల సాంగత్యం ఫలితంగా జీవితమంతా నరకం అనుభవించడానికి సిద్ధమైన పూర్ణిమను చూస్తుంటే భారతీయ స్త్రీకి ప్రతీక అనుకోవాలా, లేక భారతీయ కుటుంబ విలువలకు ఉదాహరణ అనుకోవాలా? ఈ ప్రశ్న నన్ను కచ్చితంగా కొన్ని రోజులు ఇబ్బంది పెడుతుంది.
3 Comments:
hmm...nijamEnanDi...bhaarateeya samskuritE anta...
pellilo kashta sukallo palu panchukonatamni pramanalu andaru chesataru ,kani ilanti kondare vatini patistaru.
ఏంటొ నండి చాలా ఆలోచనాప్రాయంగా ఉంది మీరు పంపించిధి,
నిజం గా ఇలాంటి పరిస్టి తుల్లో తనను నమ్ముకున్న ఆ స్త్రీ మూర్తి సంగతేంటొ...
budaraju.aswin
( బూదరజు అశ్విన్ )
Post a Comment
<< Home