గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Thursday, January 13, 2005

మూడు నెలల నిశబ్దం

ఇనర్షియాకి మారుపేరు నేను. ఏదైనా పని అసలు మొదలెట్టకుండా కడుపులో చల్ల కదలకుండా కూర్చోవడం, లేకపోతే మొదలెట్టిన పని ఆగకుండా చేసుకుంటూ పోవడం.. మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ షరామామూలు. కానీ ఈ సారి మాత్రం నిజంగానే కారణం ఉంది మూడు నెలలు బ్లాగు అప్డేటు చేయకపోవడానికి. ఆఫీసు పని మీద యు.ఎస్. వెళ్ళానా, డిసెంబరు మొదటి వారంలో వెనక్కి రాగానే ఇల్లు వెతకడం మొదలెట్టాను. వరసగా రెండు శనాదివారాలు వెతికి విసుగొచ్చింది గాని సరైన ఇల్లు మాత్రం దొరకలా. సరే శశి గాడి ఇంట్లో చేరాను టెంపరరీగా. దానికి ఒక వారాంతం గోవిందా. తర్వాతేమో పనిలో మునిగిపోయాను. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళొచ్చాను. అటునుంచి బెంగళూరు కూడా... కొత్త సంవత్సరపు రాత్రి అక్కడ స్నేహితులతో గడిపాను. కాస్త వీలు దొరికితే సినిమాలు, పుస్తకాలు.. అన్నట్టు నిన్న రాత్రి యండమూరి "ఓ వర్షాకాలపు సాయంత్రం" చదివాను. పరమ చెత్తగా ఉంది. యండమూరి ఇక నవలలు రాయడం ఆపేస్తే బాగుండు. ఇంకా రంగనాయకమ్మ "టామ్ మామ ఇల్లు" (అంకుల్ టామ్స్ కేబిన్ కి తెలుగు అనువాదం) చదవడం పూర్తి చేసాను.

*** సశేషం ***

4 Comments:

Blogger oremuna said...

సంతోషం, నా నిరీక్షణ ఫలించినది
మరళా మీ బ్లాగు పనిచేస్తుంది

మీరు హైదరాబాదులోనే ఇల్లు వెతుకుతున్నారా? ఏ ఏరియాలో ? నేనేమైనా సహాయం చెయ్యగలనేమో!గచిబౌళి లో అయితే

మీరు లేఖ రాయడం మనవద్దు, ఎందుకంటే జనాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పల్స్ ఉంటుంది, ఎన్ని ఎక్కువ ప్రోగ్రాములు ఉంటే జనాలు తెలుగు అంత బాగా ఉపయోగిస్తారు

ఉంటాను

January 19, 2005 11:17 AM  
Blogger rajapiduri said...

hello naveen,
your blog is really good. it is so refreshing to hear about the books you read.
i have been trying to put a blog in telugu. i am using CDAC's ileap software
and could make documents but somehow they don't show up properly in the blog.
(my user id is rajapiduri) - the cdac software itself is reasonably good but does not show up ?
any help from you is appreciated.

Regards
Raja

February 05, 2005 1:45 AM  
Blogger నవీన్ said...

Hi Raja,
Thanks for visiting my blog. The way my blog (and many other blogs) works is:I use unicode for my content. So there's nothing special I do to make it visible in proper telugu script. Ofcourse you need a tool to get telugu unicode output. And you need a font that is unicode compliant. Windows XP comes with Gautami font which is unicode compliant, which is the very principle this blog is based on. I see no reason why you can't see telugu text if the iLeap software can output telugu unicode text. But I have never worked on iLeap software myself, so I can't comment on why it doesn't work for you. Please check http://aksharamala.com for a very good transliteration tool as well as good information on telugu unicode.

February 10, 2005 4:32 PM  
Blogger rajapiduri said...

హల్లో నవీన్ గారూ,

నేను అక్షరమాల ని download చేసి తెలుగు టైప్ చెయ్యగలుగుతున్నాను. బ్లాగు నిదానంగా update చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి దాని పేరు rajapiduri.blogspot.com.
మీ బ్లాగ్ చాలా బాగుంది. దయచేసి వీలు కుదిరినప్పుడల్లా రాస్తూ ఉండండి.
ఉంటాను.
రాజా

February 25, 2005 3:19 AM  

Post a Comment

<< Home