
ఈ విషయం మీకు తెలిసే ఉండొచ్చు. ఎంఎస్ఎన్ మెసెంజరులో చాలా రోజుల్నుంచి ఉంది గాని యాహూలో ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు యాహూ మెసెంజరులో కూడా యూనికోడ్ (ఇండిక్) సపోర్టు బావుంది. అంటే తెలుగులో భేషుగ్గా మాట్లాడుకోవచ్చన్నమాట. మొన్న మా కొలీగ్ నేను యాహూలో తెలుగులో మాట్లాడ్డం చూసి చాలా ఆశ్చర్యపడేసరికి, ఈ విషయం తెలియని వాళ్ళు, అంతగా గమనించని వాళ్ళు, తెలుసుకుంటారు కదా అని ఈ పోస్టు చేస్తున్నాను.
6 Comments:
ilaa amaavaaSyaku puNNamiki O saari maaku darSanamistaarannamaaTa
:) కిరణ్ గారూ,
అదేమీ లేదండి. వీలున్నప్పుడు బ్లాగు చేస్తూనే ఉన్నాను. కాలం గడిచే కొద్దీ ప్రాథమ్యాలు మారుతూ ఉంటాయి కదండీ.. నేను పెద్దగా నా బ్లాగుకి రాయకపోయినా మీ బ్లాగు, ఇంకా ఇతర బ్లాగులు చూస్తూనే ఉన్నాను. మీరు తెలుగు బ్లాగింగు ప్రాచుర్యం పెంచడానికి చక్కగా కృషి చేస్తున్నారు. మీకు నా అభినందనలు.
Navin gaaru. ilaa telugulo yahoo chat cheyyocchani teleedandi. elaa cheyyaalo konchem cheptaaraa? Thanks in advance.
- V
ఇంగ్లీషు నుండి తెలుగు యూనికోడ్ కి ట్రాన్స్లిటరేట్ చేయగలిగిన ప్రోగ్రాం ఏదైనా వాడి యాహూ లేదా ఇతర (తెలుగు యూనికోడ్ అర్థం చేసుకోగల) చాట్ ప్రోగ్రాముల ద్వారా తెలుగులో చాట్ చేయవచ్చు. ఉదా: అక్షరమాల ఫ్రీ ఎడిషన్ http://aksharamala.com
నేను యాహూ అని సరిగ్గ అరవలేకపోతున్నను....
ముందు wordpad లొ అరచి తర్వత యాహూ లొకి copy చెయ్యల్సి వస్తోంది....కుంచం సలహ ఇవ్వండి గురువు గారు , మీకు పుణ్యం వుంతుంది ...
మీ blog చాలా ్చాలా చాలా బావుంది .
సంజు-ది కింగ్ గారు,
అక్షరమాల ఫ్రీ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకోండి. తరువాత మీరు CTRL+SHIFT+T అనే హాట్ కీ వాడి తెలుగు - ఇంగ్లీష్ మోడ్స్ మధ్య మారవచ్చు. తెలుగు మోడ్ లో ఉన్నప్పుడు యాహూలో నేరుగా తెలుగులో టైప్ చేయొచ్చు.
Post a Comment
<< Home