నేను కూడా ఒక ఇంటి వాడిని కాబోతున్నానోచ్
ఇంకో మూణ్నెలల్లో నా పెళ్ళి. నా జీవితం లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నాకే కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళందరికీ... కొంతమంది సంతోషపడితే, కొందరు చిరాకు పడుతున్నారు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడట్లేదని, నా లోకంలో నేనుంటున్నానని... నేను దేన్నీ పట్టించుకునే స్థితిలో లేనని నాక్కూడా అర్థమవుతూనే ఉంది. ఏం చేయను... కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మైకమో, భ్రాంతో, మరొకటో తెలియని ఈ పరిస్థితిని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ అందమైన చిరునవ్వు మనసు పొరల్లోకి విద్యుల్లతలా పాకి అల్లరి చేసే అనుభూతి ఎంత కాలమైనా అనుభవించవచ్చు, విధి దయ తలిస్తే. ఎన్నాళ్ళిలా ఉంటానో కాలమే చెప్పాలి.
బ్లాగు గురించి పట్టించుకోవడం మానేసి చాలా రోజులైందన్న చింత ఇక ఎంత మాత్రం ఉండదు నాకు. అసలు బ్లాగు చేయడానికి ఏదో ఒక జీవితానుభవం కావాలి కదా. గాజు పలక లోంచి చూస్తే కనిపించే ఏడు రంగుల కంటే వర్షానంతరపు ఇంద్రధనుస్సు అందమైనది కదా. జీవితాన్ని బ్లాగు చేస్తాం కాని, బ్లాగే జీవితం కాకూడదు కదా.
బ్లాగు గురించి పట్టించుకోవడం మానేసి చాలా రోజులైందన్న చింత ఇక ఎంత మాత్రం ఉండదు నాకు. అసలు బ్లాగు చేయడానికి ఏదో ఒక జీవితానుభవం కావాలి కదా. గాజు పలక లోంచి చూస్తే కనిపించే ఏడు రంగుల కంటే వర్షానంతరపు ఇంద్రధనుస్సు అందమైనది కదా. జీవితాన్ని బ్లాగు చేస్తాం కాని, బ్లాగే జీవితం కాకూడదు కదా.
8 Comments:
నవీన్ గారూ,
శుభాకాంక్షలు..
రాజా
ఆల్ ద బెష్ట్
ఎంజాయ్ మాడి
నాకు మీ సూత్రం అర్దం కాలేదు
మీరు కనీసం అప్పుడప్పుడైనా బ్లాగు రాస్తారా?
మీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తున్నారా?
ఉగాది శుభాకాంక్షలు
కిరణ్ గారు మరియు రాజా గారికి,
మీ శుభాకాంక్షలకు కృతజ్ఞుణ్ణి.
మీకిద్దరికీ నా ఉగాది శుభాకాంక్షలు.
కిరణ్ గారు,
నా సూత్రం నాకే సరిగ్గా అర్థం కాలేదు. మీకు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. తాగుబోతు మాటలకు, ప్రేమలో పడ్డవాడి మాటలకు అర్థాలు వెతక్కూడదు మరి:) నా పెళ్ళికి తప్పకుండా పిలుస్తానండి. శుభలేఖ అచ్చవగానే మెయిల్ చేస్తాను.
శుభాకాంక్షలు and ఆల్ ద బెష్ట్
నవీన్ గారు,
నమస్కారం, శుభాకాంక్షలు, ఆల్ ద బెస్ట్. మీరు పెళ్ళి (కొంతకాలం గేప్) తరువాత కూడా ఈ బ్లాగును మరువక, తప్పక కొనసాగించగలరు.
ఇట్లు,
నాగారాజా టి. (తెనుగు.ఆర్గు)
:) అలానే ఉంటుంది మరి.
మీ అయోమయం చూస్తుంటే నాకు యండమూరి వారి మాటలు గుర్తొస్తున్నాయి.
"నువ్వు లేనప్పుడు నాతో ఏమి ఉండదు నీ జ్ఞాపకం తప్ప.
నువ్వు ఉన్నప్పుడు నేను కూడా ఉండను నువ్వు తప్ప."
Wow me blog adirindi naku kuda
accha telugu lo jawabu ivalani vundi kani emi chestam naku ela type cheyalo emito ardam kadu
Post a Comment
<< Home