గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Thursday, June 03, 2010

అనుక్షణికం

మంచు పర్వతం లోపల మధ్యలో కోటిటన్నుల మెగ్నీషియం వైరు వొక్కసారిగా భగ్గున మండితే వొచ్చే చల్లని తెల్లని కాంతి పుంజం, ఆమెలా వుంటుంది.

***

"అవన్నీ పోనీండి. ఇప్పుడు యీ గాయత్రికి మూడోనెల. మీ భాషలో శూద్రసంపర్కం వల్ల. యేవంటారు?" అంది గాయత్రి, తాపీగా.

"నువ్వు గాయత్రివి కాదే. ఆ పేరుకే అవమానం. యేడేడు పధ్నాలుగు తరాలు యెటు చూసినా ఇలాంటి భ్రష్టు పని లేదు. నిప్పులాంటి వంశం."

"నేనూ నిప్పులాంటిదాన్నే. అతనుకాక మరెవరు ముట్టుకున్నా నిప్పులా మండేదాన్ని. కాలి మసి అయ్యేవాడు."

(అనుక్షణికంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు ...)