గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Wednesday, October 24, 2012

నిశాకాంత

నల్లబడ్డ ఆకాశం
కింద నలుపెక్కిన నీటి గలగల
ఆ వొడ్డునే తలలూగిస్తూ
పొడవాటి చెట్లు గుసగుస
గుబురు మొక్కల చాటున
కీచురాళ్ళు కీచు కీచు
ఆ పక్కనే రాళ్ళ మాటున
కప్పలు బెక బెక
సయ్యాటల గాలి
రివ్వుమనే హోరు జోరు

ఆ యేటి వొడ్డున
లాంతరు వెలుగులో
హసిత మందాకినిలా
నడుస్తున్న ఆమె
కాలి అందెల సవ్వడికి
సంఘీభావంగా
ప్రకృతి జుగల్బందీ


4 Comments:

Anonymous srinivas kanchi said...

adbutham mee kavithaa paatavam,
andukondi nestham naa rachanaa vandanam

October 27, 2012 2:30 AM  
Blogger చైతన్య said...

:-)

October 30, 2012 1:50 PM  
Anonymous Anonymous said...

Adbhuthamaina bhavala andamaina allika mee kavitha

November 01, 2012 11:37 PM  
Blogger నవజీవన్ said...

ప్రకృతి వర్ణన అద్భుతం మిత్రమా....మీ కవిత్వంలో

October 23, 2014 10:24 PM  

Post a Comment

<< Home