గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Tuesday, May 25, 2010

వసంతం

నిన్నొదిలి వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది
కాలాన్ని గదిలో పెట్టి తాళం వేయాలని
కానీ ఎందుకో మరి ఆగిపోతాను
దిగంతపు అంచులకు ప్రయాణం తప్పదు

వేయి యుగాల ప్రయాణం తర్వాత
చేరవలసిన చోటొస్తుంది
అక్కడికెళ్ళాకగానీ నాకర్థం కాదు
నా వునికిని నీ దగ్గర వదిలి వచ్చానని

అనంత దూరాలకావల వేచి వుంటాను
నిన్ను తిరిగి కలిసే క్షణం కోసం
ఎన్నో శిశిరాల తర్వాత
ఎదురొచ్చే ఒక్క వసంతం కోసం

3 Comments:

Blogger భావన said...

చాలా బాగుంది ప్రయాణం తప్పని నడకలో తిరిగి కలిసే ఒక వసంతాల వుదయం కోసం ఎదురు చూపు.

May 25, 2010 10:50 AM  
Blogger Appalaraju Jaggupilli said...

hi naveen, chala bagundi vasantam.

August 04, 2010 2:46 PM  
Blogger PraCash said...

Naveen

This is praCash from bangalore it's nice yaar...

December 19, 2010 2:45 PM  

Post a Comment

<< Home