గడ్డి పూలు

ఒక తెలుగు బ్లాగు

Name:
Location: హైదరాబాదు, India

Thursday, January 13, 2005

మూడు నెలల నిశబ్దం

ఇనర్షియాకి మారుపేరు నేను. ఏదైనా పని అసలు మొదలెట్టకుండా కడుపులో చల్ల కదలకుండా కూర్చోవడం, లేకపోతే మొదలెట్టిన పని ఆగకుండా చేసుకుంటూ పోవడం.. మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ షరామామూలు. కానీ ఈ సారి మాత్రం నిజంగానే కారణం ఉంది మూడు నెలలు బ్లాగు అప్డేటు చేయకపోవడానికి. ఆఫీసు పని మీద యు.ఎస్. వెళ్ళానా, డిసెంబరు మొదటి వారంలో వెనక్కి రాగానే ఇల్లు వెతకడం మొదలెట్టాను. వరసగా రెండు శనాదివారాలు వెతికి విసుగొచ్చింది గాని సరైన ఇల్లు మాత్రం దొరకలా. సరే శశి గాడి ఇంట్లో చేరాను టెంపరరీగా. దానికి ఒక వారాంతం గోవిందా. తర్వాతేమో పనిలో మునిగిపోయాను. ఆ తర్వాత మా ఊరికి వెళ్ళొచ్చాను. అటునుంచి బెంగళూరు కూడా... కొత్త సంవత్సరపు రాత్రి అక్కడ స్నేహితులతో గడిపాను. కాస్త వీలు దొరికితే సినిమాలు, పుస్తకాలు.. అన్నట్టు నిన్న రాత్రి యండమూరి "ఓ వర్షాకాలపు సాయంత్రం" చదివాను. పరమ చెత్తగా ఉంది. యండమూరి ఇక నవలలు రాయడం ఆపేస్తే బాగుండు. ఇంకా రంగనాయకమ్మ "టామ్ మామ ఇల్లు" (అంకుల్ టామ్స్ కేబిన్ కి తెలుగు అనువాదం) చదవడం పూర్తి చేసాను.

*** సశేషం ***